నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబును పరామర్శించారు. ఇటీవల కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణించిన సమయంలో బాలయ్య టర్కీలో షూటింగ్ చేస్తున్నారు. దాంతో ఇందిరాదేవి చనిపోయిన రోజు బాలయ్య రాలేకపోయారు.
టర్కీ నుండి షూటింగ్ ముగించుకొని వచ్చిన బాలయ్య వెంటనే అన్ స్టాపబుల్ 2 షోలో పాల్గొన్నారు దాంతో మహేష్ బాబు , కృష్ణ లను కలవలేకపోయారు. ఈరోజు అక్టోబర్ 8 న ఇందిరాదేవి పెద్ద కర్మ కావడంతో ఆ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు బాలయ్య. ఇందిరాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాలయ్య.
మహేష్ బాబును కలిసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బాలయ్య తన ఇంటికి రావడంతో మహేష్ బాబు సాదరంగా తోడ్కొని వచ్చారు. బాలయ్య తో కొద్దిసేపు ముచ్చటించిన తర్వాత బాలయ్య తిరిగి వెళ్లిపోయారు. తల్లి మరణంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగిన మహేష్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.