
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ చేసారు మేకర్స్. ఉగాది పండగ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ చేసారు. బాలయ్య ఊర మాస్ లుక్ అదిరింది. దాంతో నందమూరి అభిమానులకు ఉగాది పండగ పూట మరింత జోష్ తెప్పించేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాలయ్య ఈ చిత్రంలో విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్య శిక్ష పడిన ఖైదీగా అలాగే ప్రతీకారం కోసం తహతహలాడే వృద్దుడిగా విభిన్న గెటప్ లలో కనిపించనున్నట్లు సమాచారం.
అనిల్ రావిపూడి ఇంతవరకు ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలను మాత్రమే ఎక్కువగా చేసాడు. కానీ మొట్టమొదటి సారి పూర్తిగా యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే బాలయ్య కెరీర్ లోనే విభిన్న చిత్రంగా ఇది రూపొందుతోంది. బాలయ్య గెటప్ కు అద్భుత స్పందన వచ్చేలా కనబడుతోంది. వీరసింహారెడ్డి చిత్రం తర్వాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.