నటసింహం నందమూరి బాలకృష్ణ తో మరో సంచలనానికి సిద్ధమవుతోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే బాలయ్య తో అన్ స్టాపబుల్ షో చేసి సంచలనం సృష్టించింది. ఆ షో ఇండియాలోనే నెంబర్ వన్ షో గా రికార్డుల మోత మోగించింది. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మరింత ఫేమస్ అయ్యేలా చేసింది ఆ షో. దాంతో మళ్లీ బాలయ్య తో మరో సంచలనం సృష్టించాలని భావిస్తోంది ఆహా.
ఇంతకీ ఆహా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా……. బాలయ్య చేత వెబ్ సిరీస్ చేయాలని అందుకోసం కథ అన్వేషణలో ఉంది ఆహా టీమ్. ఇందుకోసం బాలయ్య ను కూడా ఒప్పించిందట ఆహా. బాలయ్య డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కు వస్తాడని ఊహించలేదు ఎవరూ. అలాంటిది బాలయ్య ను ఒప్పించి టాక్ షో చేయించారు. ఇక ఇప్పుడేమో బాలయ్య ను వెబ్ సిరీస్ లోకి కూడా దించి ఆ రికార్డ్ కూడా తామే సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట. ఇక బాలయ్య కూడా మంచి కథ దొరికితే తప్పకుండా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో కథ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఆహా టీమ్.