నందమూరి కుటుంబం అరుదైన చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆ అరుదైన చరిత్ర ఏంటి ? అనే కదా …… ప్రపంచ సీనీ చరిత్రలో పలువురు హీరోలు తమ వారసులు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. కానీ నందమూరి కుటుంబం మాత్రమే మూడు తరాల హీరోలు త్రిపాత్రాభినయం పోషించిన చరిత్ర సొంతం చేసుకుంది. ఇలాంటి చరిత్ర ఏ కుటుంబానికి కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు సుమా.
నందమూరి తారకరామారావు త్రిపాత్రాభినయం పోషించిన చిత్రాలు కుటుంబ గౌరవం , దానవీర శూర కర్ణ , శ్రీకృష్ణ సత్య . ఇక నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం అధినాయకుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం జై లవకుశ , ఇక ఇప్పుడేమో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం అమిగోస్. ఈ సినిమా ఈనెల 10 న విడుదలకు సిద్ధమైంది.
ఇలా నందమూరి కుటుంబ హీరోలు మాత్రమే త్రిపాత్రాభినయం పోషించిన చరిత్ర సొంతం చేసుకున్నారు. దాంతో ప్రపంచ సినీ చరిత్రలోనే ఇలాంటి అరుదైన ఘనత సొంతం చేసుకున్న హీరోలు లేరు అనే చెప్పాలి.