
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టీజర్ , ట్రైలర్ లు ఉన్నాయి దాంతో తప్పకుండా హిట్టు కొడతామనే ధీమాతో ఉన్నాడు కళ్యాణ్ రామ్.
ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో సెన్సార్ టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకీ సెన్సార్ టాక్ ప్రకారం అమిగోస్ ఎలా ఉందో తెలుసా……. హిట్టు అనే అంటున్నారు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించడం ….. ఆ మూడు పాత్రల్లో కూడా వెరీయేషన్స్ ఉండటంతో ఇదే సినిమాకు హైలెట్ అయ్యిందని అంటున్నారు. సస్పెన్స్ , యాక్షన్ , రొమాన్స్ వెరసి అమిగోస్ తప్పకుండా కళ్యాణ్ రామ్ కు మరో హిట్టు పడినట్లే అని అంటున్నారు.
అయితే సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ అసలైన తీర్పు మాత్రం ప్రేక్షకులు ఈనెల 10 న ఇవ్వనున్నారు. సగటు ప్రేక్షకుడు ఇచ్చేదే అసలైన తీర్పు దాంతో ఆ తీర్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.