నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” అమిగోస్ ”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్షితా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించడం విశేషం. కొద్దిసేపటి క్రితం అమిగోస్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్.
ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులను అలరించేలానే కనబడుతోంది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించడం అలాగే మూడు పాత్రలు కూడా కలుసుకోవడం ….. కలుసుకున్న తర్వాత విపరీత పరిణామాలు జరుగుతుండటం చూస్తుంటే ఆసక్తిగానే ఉంది. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ విలన్ గా కూడా నటించినట్లు తెలుస్తోంది ……. అంటే నెగెటివ్ షేడ్ ఎక్కువగా ఉంది.
ఈ సినిమా ఫిబ్రవరి 10 న విడుదలకు సిద్ధమైంది. కళ్యాణ్ రామ్ ఇంతకుముందు గత ఏడాది బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఉన్నాడు. ఇక అమిగోస్ అనే చిత్రం ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధించి కళ్యాణ్ రామ్ కు మరింత జోష్ పెంచుతుందా ? లేదా ? అన్నది ఫిబ్రవరి 10 న తేలనుంది. ఈ చిత్రంలో ”ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ ” అనే పాటను రీమిక్స్ చేసారు. ఆ పాట నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మక్షేత్రం చిత్రంలోనిది కావడం విశేషం.