
నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం ” అమిగోస్ ”. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ రివ్యూ లను ట్విట్టర్ లో ఇస్తూనే ఉన్నారు. ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో తెలుసా ……… మిశ్రమ స్పందన అనే చెప్పాలి ఎందుకంటే కొంతమంది బాగుందని అంటుంటే మరికొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు.
ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని కథనం స్లోగా సాగుతుందని , అయితే సెకండాఫ్ ఫాస్ట్ గా ఉందని , కళ్యాణ్ రామ్ నటనకు ఫిదా అయ్యామని అంటున్నారు. దర్శకుడు తీసుకున్న కథ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదని కామెంట్ చేస్తున్నారు. అలాగే 2. 25 నుండి 4 వరకు రేటింగ్ ఇస్తున్నారు. దాంతో ట్విట్టర్ వీరుల్లో మిశ్రమ స్పందన అనే చెప్పాలి.
అయితే అసలు తీర్పు ప్రేక్షకులు యునానిమస్ గా తీర్పు ఇవ్వనున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా ? చూడాలి. అమిగోస్ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నట్లు కనబడుతోంది బింబిసార విజయంతో.