నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహాశివరాత్రి రోజునే పరమపదించిన విషయం తెలిసిందే. దాంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇటీవలే ఫిలిం నగర్ లోని కల్చరల్ సెంటర్ లో చిన్న కర్మ నిర్వహించారు. ఇక పెద్ద కర్మ కు కూడా ముహూర్తం నిర్ణయించారు కుటుంబ సభ్యులు. ఇంతకీ తారకరత్న పెద్ద కర్మ ఎప్పుడో తెలుసా ….. మార్చి 2 న.
ఫిలిం నగర్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో మార్చి 2 న నందమూరి తారకరత్న పెద్ద కర్మ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు కార్డు కూడా ప్రింట్ చేయించి కుటుంబ సభ్యులకు , మిత్రులకు , రాజకీయ , సినీ ప్రముఖులు ఆహ్వానాలు పంపుతున్నారు. నందమూరి బాలకృష్ణ , ఎంపీ విజయ సాయి రెడ్డి ఈ పనులను ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.
ఇప్పటికే తారకరత్న కుటుంబ బాధ్యత నాదే అని బాలయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. తారకరత్న పిల్లలు కూడా బాలయ్యకు దగ్గరయ్యారు. తారకరత్న ను మళ్ళీ నటుడిగా బిజీ అయ్యేలా చేయాలని బాలయ్య భావించాడు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే తారకరత్న గుండెపోటుతో మరణించాడు. మార్చి 2 న జరిగే తారకరత్న పెద్ద కర్మకు పెద్ద ఎత్తున బంధుమిత్రులు హాజరు కానున్నారు. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే తారకరత్న మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.