
నందమూరి తారకరత్న చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి తారకరత్న చనిపోవడంతో అతడి గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తారకరత్న చివరి వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అలా ఆ వీడియో వైరల్ గా మారింది. తారకరత్న చివరి సారిగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.
23 రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్న సమయంలో చాలా వ్యవహారాలు తారకరత్న దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉదయమే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే లోపల కాస్త నలతగా ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేస్తుండగానే ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన తారకరత్నను కుప్పం లోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం బెంగుళూర్ కు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు మృత్యు ఒడిలో చేరిపోయాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేయాలని అసెంబ్లీకి అడుగు పెట్టాలని ఆశించిన తారకరత్న ఊహించని విధంగా మృత్యువాత పడటంతో తారకరత్న అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగారు. తారకరత్న చివరి వీడియో ఇలా వైరల్ గా మారింది.