
నందమూరి తారకరత్న కేవలం 40 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు దాంతో ఇంత చిన్న వయసులోనే చనిపోయాడంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు. హీరోగా ఓ వెలుగు వెలుగుదామని టాలీవుడ్ లో అడుగు పెట్టాడు నందమూరి తారకరత్న. హీరోగా కెరీర్ ప్రారంభించడమే ఏకంగా 9 సినిమాలు ఒకే రోజున ప్రారంభమయ్యాయి.
ఇది సినిమా రంగ చరిత్రలో ఒక రికార్డ్ . అందుకే ఈ విషయంలో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు తారకరత్న. అయితే హీరోగా నటించిన తారకరత్న కు చేదు అనుభవమే ఎదురయ్యింది. చాలా సినిమాల్లో నటించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు.
దాంతో ఇటీవలే రాజకీయ రంగంపై మక్కువ పెంచుకున్నాడు. 2024 లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు బాలయ్య బాబాయ్ తో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అలాగే నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ లతో చర్చలు జరిపాడు కూడా. మొత్తానికి తారకరత్న కు టికెట్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు.
అందులో భాగంగానే నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నాడు తారకరత్న. అయితే తాను ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించిన తారకరత్న కు ఆ కోరిక తీరకుండానే చనిపోవడం ……. కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.