
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత 23 రోజులుగా బెంగుళూరు లోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు కన్నుమూశారు. దాంతో నందమూరి కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగింది. మహా శివరాత్రి పర్వదినం రోజునే తారకరత్న మరణించడం గమనార్హం.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నందమూరి బాలకృష్ణ హుటాహుటిన హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్లారు బాలయ్య. తారకరత్న ను బ్రతికించడానికి వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసారు. కానీ మెదడు భాగం దెబ్బతినడంతో కోలుకోలేక పోయాడు. తారకరత్న హీరోగా పరిచయమే ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఒకేసారి ….. ఓకేరోజున 9 సినిమాలు ప్రారంభించిన హీరో లేడు. అలాంటి అరుదైన రికార్డ్ నందమూరి తారకరత్న సొంతమైంది