
నందమూరి తారకరత్న గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే 23 రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా కోలుకోలేదు సరికదా మరింతగా ఆరోగ్యం క్షీణీస్తోందని తెలుస్తోంది. దాంతో హుటాహుటిన నందమూరి బాలకృష్ణ బెంగుళూరుకు వెళ్ళాడు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఇంటి పట్టునే ఉండి పూజలు చేసుకుంటూ ఉండాల్సిన బాలయ్య హుటాహుటిన బెంగుళూరుకు ఎందుకు వెళ్ళాడు…… అసలు విషయం ఏంటి ? అనే అనుమానం కలుగుతోంది.
నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించడం వల్లే బాలయ్య బెంగుళూరు వెళ్లాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారకరత్న మెదడు భాగం దెబ్బతిందని దాంతో విదేశాలకు చెందిన డాక్టర్ల బృందాన్ని కూడా రప్పించారు. అయితే గత 23 రోజులలో కేవలం 2 సార్లు మాత్రమే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నారాయణ హృదయాలయా వైద్యులు. దాంతో తారకరత్న ఆరోగ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. తారకరత్న ఆరోగ్యం విషమించడంతో హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని తెలుస్తోంది. ఇక ఈరోజు బాలయ్య తో డాక్టర్లు చర్చించిన మీదట హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారని సమాచారం.