హీరో నాని కోసం యూత్ ఎగబడ్డారు. నాని ని కలిసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు. వివిధ కళాశాలల నుండి హైదరాబాద్ చేరుకున్నారు. గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమా షూటింగ్ జరుగుతోంది. దాంతో అక్కడికి అనుమతి ఇచ్చారు దర్శక నిర్మాతలు.
నానిని కలవడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో వాళ్లందరినీ ఆడ , మగ వేరు వేరుగా రెండు క్యూ లైన్ లను పెట్టి వరుసగా ఒక్కొక్కరితో ఫోటోలు దిగాడు నాని. అలాగే కొంతమందితో ముచ్చటించాడు. ఈ తతంగమంతా చాలా సమయం పట్టింది. అయితే తనని చూడటానికి , మాట్లాడటానికి ఎక్కడెక్కడి నుండో వచ్చారు కాబట్టి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలనే భావించాడు నాని. దాంతో అభిమానులు ఉప్పొంగిపోయారు.
నాని తాజాగా దసరా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని బొగ్గు గనుల నేపథ్యంలో దసరా చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ధూమ్ ధామ్ చేద్దాం అనే పాట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నాని సరసన కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటిస్తోంది.