
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నాని కొత్త సినిమా ప్రారంభమైంది. జనవరి 31 న ఈ సినిమా ప్రారంభం కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నాని పై క్లాప్ కొట్టగా అగ్ర నిర్మాత అశ్వనీదత్ కెమెరా స్విచ్చాన్ చేసారు. స్క్రిప్ట్ ను విజయేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాతలకు అందించాడు. ఇక ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ ఎంతమంది చేసారో తెలుసా ……. పెద్ద లిస్టే ఉంది మరి. యువ దర్శకులు హను రాఘవపూడి , కిషోర్ తిరుమల , బుచ్చిబాబు , వశిష్ఠ , నక్కిన త్రినాథరావు తదితరులు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా ……. కొత్త కుర్రాడు శౌర్య. అవును నాని ని కలిసి కథ చెప్పి ఒప్పించాడు దాంతో ఈ కుర్రాడికి అవకాశం ఇచ్చాడు నాని. సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన భామ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నాని సరసన నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు.