తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ అయితే లభించాయి. ఇక సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కథ బాగున్నప్పటికి , కథనం ఆసక్తికరంగా లేదని అంటున్నారు. ఇది సినిమా విజయం పై ప్రభావం చూపుతుందా ? లేదా ? అన్నది ఒకటి రెండు రోజులలో తెలిసిపోనుంది.
అయితే ఈ సినిమా కథ మొదట హీరో నానికి చెప్పాడట దర్శకుడు వెంకీ అట్లూరి. కథ బాగుంది…… కానీ కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. ఆ మార్పులు చేసి తీసుకురా అని అన్నాడట. దాంతో వెంకీ అట్లూరి మార్పులు చేయడానికి నిరాకరించాడు.
అంతేకాదు ఇదే కథను ధనుష్ కు చెప్పడం …… ధనుష్ కు నచ్చి వెంటనే డేట్స్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. సినిమా కూడా తెరకెక్కింది. ఇక ఇప్పుడేమో విడుదల అయ్యింది. సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే కథ బాగున్నప్పటికి , స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విదంగా లేదని అంటున్నారు. అదే సినిమా ఫలితాన్ని తారుమారు చేసేది. ఇది సార్ చిత్రానికి ప్లస్ అవుతుందా ? మైనస్ అవుతుందా ? అన్నది చూడాలి. ఒకవేళ సినిమా హిట్ అయితే నాని ఈ సినిమాని రిజెక్ట్ చేసి తప్పు చేసినట్లే …… ఒకవేళ సార్ చిత్రం విజయవంతం కాకపోతే నాని తీసుకున్న నిర్ణయం సరైనదే అని భావించాలి. ఏంటి అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.