
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దసరా. ఇది హీరో నానికి మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం . తెలుగు , తమిళ్ , మలయాళ , హిందీ , కన్నడ భాషల్లో ఏకకాలంలో మార్చి 30 న విడుదల కానుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం దసరా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చేలా కనబడుతోంది.
నాని తెలంగాణ యువకుడిగా నటించిన తీరుకు , కనిపించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషాంగా అలరిస్తోంది. నాని ఊర మాస్ లుక్ , కీర్తి సురేష్ డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ వెరసి దసరా బ్లాక్ బస్టర్ అయ్యేలాగే కనబడుతోంది. రా రస్టిక్ గా తెరకెక్కిన దసరా పై నాని భారీ ఆశలే పెట్టుకున్నాడు.
అందుకే ముంబయి , చెన్నై , కేరళ , బెంగుళూరు ఇలా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నాడు. భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా లేవు దాంతో ఆ లోటు నాని దసరా చిత్రంతో తీర్చడం ఖాయమని భావిస్తున్నారు.