
హీరో నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” హిట్ ”. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో హిట్ -2 చిత్రాన్ని నిర్మించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈ రెండో పార్ట్ లో హీరో విశ్వక్ సేన్ కాదు ……. అడవి శేష్.
మేజర్ చిత్రంతో అడవి శేష్ తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ , హిందీ ప్రేక్షకులను కూడా అలరించాడు. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో రూపొందిన మేజర్ సూపర్ హిట్ గా నిలవడంతో అడవి శేష్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో హిట్ – 2 చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు.
అంతేగాదు హిట్ – 2 తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అందుకే హిట్ – 3 చిత్రానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు హీరో నాని. అయితే హిట్ – 3 లో నాని నటిస్తాడా ? లేక మరో హీరోనా ? అన్నది హిట్ – 2 చూస్తే తెలుస్తుందనే హింట్ కూడా ఇచ్చాడు నాని. డిసెంబర్ 2 న విడుదల అవుతున్న ఈ చిత్రంపై అడవి శేష్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో తనికెళ్ళ భరణి , భానుచందర్ , కోమలీ ప్రసాద్ , శ్రీనాథ్ , రావు రమేష్ , పోసాని తదితరులు నటించారు. హిట్ – 2 భవితవ్యం ఏంటి ? అన్నది డిసెంబర్ 2 న తేలనుంది.