పవిత్రకు ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు కాగా ఇప్పుడు నరేష్ తో జరిగిన పెళ్లితో మూడో పెళ్లి అన్నమాట. ఇక నరేష్ కు ఇది నాలుగో పెళ్లి దాంతో ఈ పెళ్లిళ్ల గోల ఏంట్రా నాయనా ! అంటూ తల బాదుకుంటున్నారు నెటిజన్లు. నరేష్ – పవిత్రల పెళ్లి గురించి తెలియడంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో.
నరేష్ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. అలాగే పవిత్ర లోకేష్ కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటోంది అలాగే సహజీవనం అనే కాన్సెప్ట్ తో కూడా కొంతమందితో సహజీవనం చేసింది. తెరమీద చాలా పవిత్రంగా కనిపించే ఈ ఇద్దరూ ఇలా వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఇలా చేస్తున్నారేంట్రా బాబూ అంటూ తల పట్టుకుంటున్నారు. ఈ ఇద్దరి వ్యవహారశైలి గతకొంత కాలంగా మీడియాలో నానుతూనే ఉంది. అయితే ఎంత వివాదమైనా సరే మేము తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నరేష్ – పవిత్ర లోకేష్.
తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వీడీయో సోషల్ మీడియాలో పెట్టేసి హాయిగా హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో వదిలేసి మరింత రచ్చ రచ్చ చేస్తున్నారు. నరేష్ – పవిత్ర లోకేష్ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.