
సీనియర్ నటుడు నరేష్ సీనియర్ నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ఇద్దరూ విడిపోయారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా నరేష్ – పవిత్ర లోకేష్ లు సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ విషయం బయటపడింది. ఇక అప్పటి నుండి ఒక మూడు నెలల పాటు రచ్చ రచ్చ అయింది.
పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి …… మీడియాకు కూడా ఎక్కారు నరేష్ భార్య అలాగే పవిత్ర లోకేష్ భర్త. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా సంచలనంగా మారింది. అయితే ఇంత గొడవ జరగడంతో కొంతమంది సన్నిహితులు సలహాలు , సూచనలు ఇచ్చారట. వాళ్ళ సలహాతో నరేష్ – పవిత్ర ల మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని దాంతో భారీ మొత్తం పవిత్రకు ఇచ్చాడని టాక్ కూడా వినిపిస్తోంది.
అంతేకాదు నరేష్ తాజాగా మరో సీనియర్ నటితో సహజీవనం చేస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు నరేష్. ఇక గతకొంత కాలంగా పెళ్లి చేసుకోకుండా ఇలా సహజీవనం చేస్తున్నాడు. ప్రస్తుతం పవిత్ర లోకేష్ నరేష్ కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.