షూటింగ్ లో ప్రమాదం జరిగింది దాంతో ప్రముఖ నటుడు నాజర్ కు గాయాలయ్యాయి. దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సంచలన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. నాజర్ ఓ భారీ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పోలీస్ అకాడెమీలో జరుగుతోంది. నాజర్ పై చిత్ర బృందం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది.
సరిగ్గా అదేసమయంలో నాజర్ కు గాయాలయ్యాయి. దాంతో షాక్ అయిన చిత్ర బృందం వెంటనే నాజర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో నాజర్ కు చికిత్స జరుగుతోంది. నాజర్ వయసు 64 సంవత్సరాలు. వయసు మీద పడటంతో అలాగే భారీకాయం కావడంతో , కొంత కాలంగా అనారోగ్యం బారిన పడుతుండటంతో ఇకపై సినిమాలకు స్వస్తి పలకాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలోనే ఈ గాయాలు అయ్యాయి.
Breaking News