సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ). సాహసాలకు మారు పేరుగా నిలిచిన కృష్ణ దాదాపు 350 చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఒకే ఏడాదిలోనే కృష్ణ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో మహేష్ బాబు తో పాటుగా ఆ కుటుంబానికి తీరని లోటని , ఆ కుటుంబానికి దేవుడు మానసిక దృఢత్వాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు నాట్స్ బృందం అరుణ గంటి, బాపయ్య చౌదరి తదితరులు
