నటుడు నవీన్ చంద్ర ను అవమానించింది కలర్స్ స్వాతి. తన దగ్గరకు నవీన్ చంద్ర వచ్చినప్పుడు నా దగ్గరకు రాకు ….. దూరంగా వెళ్ళు అంటూ అరిచిందట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు కలర్స్ స్వాతి స్వయంగా వెల్లడించడం విశేషం. తాజాగా ఈ భామ ” అమ్ము ” అనే సినిమాకు వెళ్ళింది. కొంతమంది సినీ ప్రముఖులకు అమ్ము సినిమా స్పెషల్ షో వేశారు.
దాంతో ఆ సినిమా చూసింది కలర్స్ స్వాతి. అమ్ము సినిమాలో నవీన్ చంద్ర నెగెటివ్ రోల్ పోషించాడు. ఇంకేముంది అతడి క్యారెక్టర్ చూసి కలర్స్ స్వాతి చాలా భయపడిందట. అంత దారుణమైన పాత్రను అద్భుతంగా పోషించాడు నవీన్ చంద్ర కానీ సాడిస్ట్ క్యారెక్టర్ కావడంతో అతడు నాతో మాట్లాడటానికి దగ్గరకు వచ్చినప్పుడు భయమేసి దూరంగా వెళ్ళు అని గట్టిగా చెప్పానని అంటోంది ఈ భామ.
పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత మళ్ళీ సెకండ్ ఇనింగ్స్ స్టార్ట్ చేయడానికి సమాయత్తం అవుతోంది.