సీనియర్ హీరోలు నటసింహం నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ల మధ్య భీకర పోరు తప్పేలా కనిపించడం లేదు. తాజాగా ఈ సీనియర్ హీరోలు నటిస్తున్న చిత్రాలు వచ్చే ఏడాది 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా పోటీగా విడుదల కానున్నాయి. చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఊర మాస్ లా కనబడుతోంది. దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది.
ఇక బాలయ్య తాజాగా వీర సింహా రెడ్డి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అలాగే టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇది కూడా ఊర మాస్ చిత్రం. బాలయ్య – చిరు ఇద్దరు కూడా మాస్ హీరోలు. పైగా నాలుగు దశాబ్దాలుగా హీరోలుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు.
ఈ ఇద్దరికి కూడా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతి రేసులో ఉంటే కనుక బాక్సాఫీస్ కు పూనకాలు రావడం ఖాయం. అయితే ఈ ఇద్దరిలో విజేతగా ఎవరు నిలబడతారు అన్నది ఆసక్తి కరంగా మారింది. ఈ ఇద్దరూ సీనియర్ హీరోలు అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇప్పటికి సత్తా చాటుతూనే ఉన్నారు.