
నందమూరి బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది నందమూరి లక్ష్మీ పార్వతి. తన తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబు తప్పు లేనట్లుగా బాలయ్య తన షోలో చూపించారని , అసలు బాలయ్య ఎన్టీఆర్ కడుపున పుట్టిన కొడుకేనా ? అంటూ తీవ్ర పదజాలంతో దూషించింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్థాపబుల్ . మొదటి సీజన్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండో సీజన్ ను స్టార్ట్ చేశారు బాలయ్య.
అయితే రెండో సీజన్ ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా ప్రారంభించారు. ఈ షో నిన్న సాయంత్రం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలయ్య షోకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా రావడంతో ఈ షోలో తప్పకుండా 1995 నాటి వెన్నుపోటు గురించి తప్పకుండా మాట్లాడతారని కోట్లాది మంది ఎదురు చూశారు. ఇక ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి కూడా ఈ షోను చూసింది.
ఇక ఆ షో చూశాక లక్ష్మీ పార్వతి లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో బాలయ్య పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. అసలు లక్ష్మీ పార్వతి బాలయ్య పై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. కానీ ఈ షో చూశాక మాత్రం ఆనాటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఈ షోను ఆలంబనగా చేసుకున్నారని దుయ్యబట్టింది.