నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రానికి సైమా అవార్డులు వరించాయి. సైమా అవార్డుల కోసం పలు చిత్రాలు పోటీ పడగా బాలయ్య అఖండ చిత్రం రెండు విభాగాల్లో సత్తా చాటింది. జై బాలయ్య అనే పాటతో ప్రేక్షకులను అలరించిన గీతామాధురికి ఉత్తమ గాయని అవార్డు లభించింది. జై బాలయ్య అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.
అలాగే సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ కు కూడా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది. దాంతో బాలయ్య నటించిన అఖండ చిత్రానికి రెండు విభాగాల్లో అవార్డులు లభించినట్లయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 డిసెంబర్ లో విడుదలైన విషయం తెలిసిందే.
కరోనా కష్టకాలంలో థియేటర్ లకు మళ్ళీ జనాలు వస్తారా ? అని భయపడుతున్న సమయంలో అఖండ చిత్రం ప్రేక్షకులను థియేటర్ లకు వచ్చేలా చేసింది. బాలయ్య నటజీవితంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అఖండ. సీనియర్ హీరోలకు 100 కోట్లు సాధ్యం అవుతుందా ? అనే ప్రశ్నను పటాపంచలు చేస్తూ 200 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది అఖండ. 60 ప్లస్ ఏజ్ లో కూడా బాలయ్య అనితరసాధ్యమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు.