నటసింహం నందమూరి బాలకృష్ణ టర్కీలో హల్చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య టర్కీలో ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం టర్కీ వెళ్ళాడు బాలయ్య. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ అందాల భామ కూడా టర్కీ వెళ్ళింది. అక్కడ బాలయ్య – శృతి హాసన్ లపై పాట చిత్రీకరిస్తున్నారు.
ఇక షూటింగ్ మధ్యలో బాలయ్య టర్కీలో సందడి చేసాడు. ఓ ముస్లిం కుటుంబంతో కలిసి భోజనం చేసి వాళ్లకు సంతోషాన్ని అందించాడు. అంతేకాదు సీరియల్ లపై టీవీ లపై కామెంట్స్ చేసి మరింత సంచలనం సృష్టించాడు. పనిపాట లేని వాళ్ళు కొందరు టీవీలలో సీరియల్స్ చూస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు. అదేపనిగా టీవీ చూసినా కూడా కళ్ళకు ఇబ్బందే అంటూ చురకలు అంటించాడు బాలయ్య.
అయితే బాలయ్య ఇలా మాట్లాడుతున్న సమయంలో వీడియో తీశారు ఒకరు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. బాలయ్య లాంటి స్టార్ హీరో ఇలా సాధారణ వ్యక్తిలా ఓ ముస్లిం కుటుంబంతో కలిసి పోవడం వాళ్ళని షాక్ అయ్యేలా చేసిందని అంటున్నారు. అయితే వాళ్ళని మాత్రమే కాదు నెటిజన్లను కూడా షాక్ అయ్యేలా చేస్తోంది ఆ వీడియో.
Breaking News