నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. మొదటగా ”ఆదిత్య 369” చిత్రం రాగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ తర్వాత జానపద చిత్రం చేయాలని భావించి ” భైరవ ద్వీపం ” చిత్రాన్ని చేసారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక మూడో చిత్రంగా ” శ్రీకృష్ణార్జున యుద్ధం ” చేసారు. అయితే ఇది మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఇక భైరవ ద్వీపం చిత్ర విషయానికి వస్తే …… కలర్ ఫుల్ చిత్రాలతో కొనసాగుతున్న చిత్ర పరిశ్రమలో భైరవ ద్వీపం లాంటి చిత్రాన్ని ఎవరు చూస్తారు ? అంటూ హేళన చేశారు అప్పట్లో కట్ చేస్తే భైరవ ద్వీపం విడుదల అవ్వడం …….. సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య సరసన రోజా నటించింది. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ , కేఆర్ విజయ , బాబూమోహన్ , గిరిబాబు , శుభలేఖ సుధాకర్ , రంభ తదితరులు నటించారు.
అయితే ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో బాలయ్య కురూపిగా నటించాల్సి వచ్చింది. అయితే మొదట ఈ విషయం చెప్పడానికి దర్శకులు సింగీతం తటపటాయించారట. అయితే బాలయ్య ఏమాత్రం ఆలోచించకుండా కురూపిగా నటించడానికి ఒప్పుకున్నాడట. అయితే బాలయ్య లాంటి స్టార్ హీరో అందునా మాస్ హీరో కురూపిగా నటిస్తే అభిమానులు , ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం మాత్రం ఉండేదట. అయితే సినిమా చూసాక ఆ సన్నివేశం ఏ సందర్భంలో వస్తుందో తెలిసాక ప్రేక్షకులు , అభిమానులు శాటిస్ ఫై అయ్యారు కాబట్టే మంచి రిజల్ట్ ఇచ్చారు.
ఇక కురూపి పాత్రకు సంబందించిన సన్నివేశాలను 10 రోజుల పాటు చిత్రీకరించారట దర్శకులు. ఆ 10 రోజులు కూడా ఆహారం తీసుకోకుండా కేవలం జ్యుస్ లు మాత్రమే తీసుకున్నాడట బాలయ్య. ఎందుకంటే కురూపి మేకప్ కు ఎక్కువ సమయం పడుతుంది , మేకప్ లో ఉండి భోజనం చేయడం ఇబ్బంది కాబట్టి ఉదయం మేకప్ వేస్తే సాయంత్రం వరకు కూడా షూటింగ్ పేకప్ చెప్పేంత వరకు కూడా అదే మేకప్ లో ఉండేవాడు….. తిండి మానేసాడు ఆ 10 రోజులు అంటూ బాలయ్య కష్టాన్ని గురించి వివరించాడు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు.