నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం ప్రజల కోసం ” ఎన్టీఆర్ ఆరోగ్య రథం ” ను ఏర్పాటు చేసారు. తన నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో తన ఎమ్మెల్యే నిధుల లోంచి ఈ స్కీమ్ కు తెరలేపారు. బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
మొదటిసారి 2014 లో హిందూపురం నుండి గెలుపొందాడు. ఇక రెండోసారి గెలవడం కష్టమే అనుకుంటే అనూహ్యంగా మంచి మెజారిటీతో గెలిచాడు బాలయ్య. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గెలిచిన 23 మందిలో బాలయ్య ఒకరు కావడం విశేషం. దాంతో తనని గెలిపించిన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భావించిన బాలయ్య 40 లక్షలతో ఎన్టీఆర్ ఆరోగ్య రథం అనే అంబులెన్స్ ని సిద్ధం చేసాడు.
ఈ వాహనంలో డాక్టర్ , నర్స్ లతో పాటుగా మెడికల్ సిబ్బంది ఉంటారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి ఒక రోజు చొప్పున తిరుగుతుంది ఈ వాహనం. సాధారణ జబ్బు అయితే అక్కడే పరీక్షించి మందులు ఇస్తారు. మరీ పెద్ద అనారోగ్య సమస్య అయితే పెద్ద ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. ఇక ఈ పథకాన్ని ఆగస్టు 17 న హిందూపురంలో ప్రారంభించనున్నాడు బాలయ్య. దాంతో అక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు తెలుగుదేశం, నందమూరి అభిమానులు.
Breaking News