నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలు ఒకే రోజున విడుదలై రెండు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇలాంటి అరుదైన చరిత్ర టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కు తప్ప మరొక హీరోకు లేదు. మళ్ళీ అలాంటి అరుదైన ఘనత సాధించింది నందమూరి బాలకృష్ణ మాత్రమే !
1993 సెప్టెంబర్ 3 న బాలయ్య నటించిన నిప్పురవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. అంటే బాలయ్య చిత్రానికి బాలయ్య చిత్రమే పోటీ అన్నమాట. దాంతో సినిమారంగంలోనే కాదు అభిమానుల్లో కూడా కలవరం మొదలైంది. ఎందుకంటే తమ అభిమాన హీరో నటించిన చిత్రాన్ని మొదటి రోజునే చూడాలని ఆశపడే అభిమానులకు ఇది షాకింగ్ అనే చెప్పాలి.
అయినప్పటికీ అభిమానులు తమ ప్లానింగ్ తో నిప్పురవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు భారీ ఏర్పాట్లు చేసారు. అంగరంగ వైభవంగా విడుదల అయ్యాయి కూడా. రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే నిప్పురవ్వ చిత్రంపై భారీ అంచనాలు ఉండేవి . ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది అని అనుకున్నారు. కాకపోతే హిట్ చిత్రంగా నిలిచింది అంతే ! ఇక బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయ్యింది. ఒక హీరో నటించిన రెండు చిత్రాలు కూడా ఒకే రోజున విడుదల అవ్వడం అలాగే రెండు కూడా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. అది ఒక్క బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది.
నిప్పురవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలు విడుదలై నేటికి 29 సంవత్సరాలు. దాంతో అప్పటి రోజులను తల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు బాలయ్య అభిమానులు. బంగారు బుల్లోడు చిత్రంలోని పాటలు ఇప్పటికి కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. నిప్పురవ్వ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ కాగా బంగారు బుల్లోడు చిత్రంలో బాలీవుడ్ భామ రవీనా టాండన్ , రమ్యకృష్ణ లు హీరోయిన్ లుగా నటించారు.
Breaking News
NBK- NANDAMURI BALAKRISHNA- NIPPU RAVVA- BANGARU BULLODU:నిప్పురవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు 29 ఏళ్ళు
Date: