
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఝలక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య తన వందో సినిమాగా ” గౌతమిపుత్ర శాతకర్ణి ” చిత్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో అలాగే భారతదేశాన్ని ఏలిన మొట్టమొదటి తెలుగు చక్రవర్తి కథ కావడంతో ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరగా అందుకు అంగీకరించింది అప్పటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.
అయితే వినోదపు పన్ను రాయితీ పొందినప్పటికీ ఆ రాయితీని ప్రేక్షకులకు ఇవ్వలేదని , టికెట్ ధరలు తగ్గించడం ద్వారా ప్రేక్షకులను పన్ను రాయితీ కల్పించాలి కానీ గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలు మాత్రం ఆ సౌలభ్యం ప్రేక్షకులకు కల్పించలేదు కాబట్టి ఆ సొమ్ముని నిర్మాతల నుండి ప్రభుత్వం వసూల్ చేయాలంటూ సినీ వినియోగదారుల సంఘం ఏకంగా సుప్రీం కోర్టు లోనే రిట్ దాఖలు చేసింది. దాంతో బాలయ్యకు అలాగే ఆ చిత్ర బృందానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.