
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” భీమ్లా నాయక్ ”. త్రివిక్రమ్ రచన అందించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేసారు. ఈ చిత్రాన్ని చినబాబు నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోగా నటించాల్సింది ఎవరో తెలుసా ……. ఇంకెవరు నటసింహం నందమూరి బాలకృష్ణ.
అవును …….. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని హక్కులు తీసుకున్నారు చినబాబు , నాగవంశీ. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు ….. అందుకే ఆయన చుట్టూ తిరిగారు. అయితే మలయాళ సినిమా చూసిన బాలయ్య నాకు ఈ సినిమా సెట్ కాదు …….. పవన్ కళ్యాణ్ అయితేనే బెటర్ గా ఉంటుందని చెప్పాడట.
దాంతో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కథ చెప్పగా మొహమాటం లేకుండా ఒప్పుకున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో ఆ సినిమా రూపొందింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ , నిర్మాత నాగవంశీ వెల్లడించారు. త్వరలోనే బాలయ్య తో సినిమా చేయాలని భావిస్తున్నాడు. బాలయ్య కూడా డేట్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడట.