నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. తన చిన్న కూతురు తేజస్వినిని విశాఖకు చెందిన భరత్ కు ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య కూతురు సినిమాల్లోకి వస్తోంది అనగానే హీరోయిన్ గానా ? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా ? అని అనుకుంటారు కదా ! కాదు …… నిర్మాతగా.
అవును ……. తేజస్విని నిర్మాతగా సినిమారంగంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. తండ్రి బాలకృష్ణ హీరోగా ఓ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాను భారీ లెవల్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకు తేజస్విని తెరవెనుక పనిచేస్తోంది. అన్ స్టాపబుల్ షో ఇంతగా ఫేమస్ కావడానికి , బాలయ్య లోపాలను సవరించుకోవడానికి తేజస్విని కారణం అని అంటున్నారు. షో తో సక్సెస్ అయిన తేజస్విని ఇక సినిమారంగంలో కూడా సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరు గాంచుతుందని భావిస్తున్నారు.