నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి వీర సింహారెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిన్న రాత్రి కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర ఈ టైటిల్ ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం నాలుగు రకాల టైటిల్స్ అనుకున్నారు. జై బాలయ్య, రెడ్డి గారు, అన్నగారు, వీర సింహా రెడ్డి. అయితే చివరకు వీర సింహా రెడ్డి టైటిల్ కు మొగ్గు చూపించడంతో అదే ఖరారు చేశారు. ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కి విడుదల చేయనున్నారు. ఆమేరకు ఈ విషయం కూడా అధికారికంగా ప్రకటించారు.
బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. బాలయ్య గెటప్ కు అలాగే టీజర్ కు అద్భుత స్పందన రావడంతో వీర సింహా రెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా ? లేదా ? అన్నది జనవరిలో తేలనుంది.