నటసింహం నందమూరి బాలకృష్ణ టర్కీ లో ఫైట్ చేస్తున్నాడు. నల్లని పంచెకట్టు మెలితిప్పిన మీసం , కాస్త నెరిసిన జుట్టుతో బాలయ్య భలేగా ఉన్నాడు. ఇప్పటికే ఆ లుక్ వైరల్ గా మారడం , అభిమానులకు విశేషంగా నచ్చడం తెలిసిన సంగతే ! తాజాగా బాలయ్య టర్కీ లో వీరవిహారం చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం టర్కీ వెళ్ళింది NBK107 బృందం.
అక్కడ ఫైటర్లతో బాలయ్య కు సంబందించిన యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు గోపీచంద్ మలినేని. కొంత భాగం కరీంనగర్ లో అలాగే మరికొంత హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. అంతేకాకుండా కర్నూల్, అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా NBK107 చిత్రం షూటింగ్ జరిగింది. ఇక ఇప్పుడేమో ఏకంగా టర్కీకి వెళ్లారు.
బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండటం విశేషం. ఇక కీలక పాత్రల్లో కన్నడ హీరో దునియా విజయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. దునియా విజయ్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని మొదట దసరా బరిలో నిలపాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ లో లేదంటే 2023 సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు.