
నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈరోజు ప్రారంభం కానుండగా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే నెల నుండి జరుగనుంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య విభిన్న పాత్రను పోషించనున్నాడు. బాలయ్య కూతురుగా శ్రీలీల నటించనుంది. ఇక బాలయ్య సరసన అనంతపురం భామ ప్రియాంకా జవాల్కర్ నటిస్తోంది.
అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా పలు చిత్రాలను రూపొందించాడు. అయితే ఈ చిత్రాన్ని మాత్రం యాక్షన్ , సెంటిమెంట్ కలగలిపి చేస్తున్నాడు. బాలయ్య నటజీవితంలోనే విభిన్న తరహా పాత్ర అని చెబుతున్నాడు. అయితే అది విభిన్న తరహా పాత్ర అవుతుందా ? లేదా ? అన్నది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.