
నటసింహం నందమూరి బాలకృష్ణ యమా స్పీడ్ మీదున్నాడు. 63ఏళ్ల వయసులోనూ జోరు తగ్గకుండా …… గ్యాప్ లేకుండా షూటింగ్ లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108 వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా మొదటి షెడ్యూల్ ని ఈరోజు పూర్తి చేసాడు. ఫస్ట్ షెడ్యూల్ భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసారు. అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి కావడంతో పేకప్ చెప్పారు. దాంతో న్యూ ఇయర్ కేట్ కట్ చేసి లొకేషన్ లో సందడి చేసారు బాలయ్య.
బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రాన్ని కంప్లీట్ చేసి బ్యాలెన్స్ గా ఉన్న ఒక పాటను కూడా పూర్తి చేసాడు. ఇక అదే సమయంలో అన్ స్టాపబుల్ షో కోసం పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూ అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నాడు. 63 ఏళ్ల వయసులో ఇంత జోష్ తో సినిమాలు చేయడం , అలాగే టాక్ షో నిర్వహిస్తుండటం అంటే మాములు విషయం కాదు సుమా !
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. జైలుశిక్షణా పడిన ఖైదీగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడు. ఒకటి ముసలి గెటప్ , మరొకటి యువకుడి గెటప్ . ఇక గ్లామర్ భామ శ్రీ లీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. కాకపోతే ఇదే కాస్త మింగుడు పడని అంశం అన్నమాట.