సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాన్ని కొనడానికి నెట్ ఫ్లిక్స్ భారీ రేటు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అటు బయ్యర్లు ఇటు ఓటీటీ సంస్థలు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి ఏకంగా 80 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. ఇంకేముంది వాళ్ళకే SSMB28 ఓటీటీ హక్కులు ఇచ్చేసారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషలకు కలిపి ఈ మొత్తాన్ని ఇచ్చారన్న మాట.
ఇవి కాకుండా థియేట్రికల్ రైట్స్ ఉంటాయి అలాగే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో ఈజీగా మరో 200 కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే వేసవిలో రిలీజ్ కావడం కష్టమే ! అంటే దసరా కు వెళ్లొచ్చు అని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.