
హాట్ భామ అశూ రెడ్డికి కన్నతండ్రి మద్యం బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు……. ఈ విషయాన్ని అశూ రెడ్డి స్వయంగా వెల్లడించడం విశేషం. ఓ వీడీయో రూపంలో తెలియజేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మా నాన్న మాన్షన్ హౌజ్ వైన్ బాటిల్ నాకు గిఫ్ట్ గా పంపించాడు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది అశూ రెడ్డి.
ఇంకేముంది నెటిజన్లు కొంతమంది పండగ చేసుకో అంటూ ఎంకరేజ్ చేస్తుంటే ఎక్కువ మంది మాత్రం అశూ రెడ్డిని ఆమె తండ్రిని తిట్టిపోస్తున్నారు. కన్నతండ్రి మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా పంపించడం ఏంటి ? నువ్ తీసుకోవడం అదొక ఘనకార్యంగా భావిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చి పోయి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. ఈ భామ అందాల ఆరబోత చూసి చాలా చులకనగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా …… ఐ డోంట్ కేర్ అంటోంది అశూ రెడ్డి. అందుకే విమర్శలు వస్తాయని తెలిసినా ఇలా పోస్ట్ చేసి రెచ్చగొడుతోంది.