నందమూరి తారకరత్న పెద్ద కర్మ వేడుకలో ఎన్టీఆర్ ను అవమానించాడు బాలయ్య అంటూ వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం ప్రత్యేకంగా కట్ చేసిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నందమూరి బాలకృష్ణ తమ దగ్గరకు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు లేచి నిలబడ్డారు.
అయితే బాలయ్య మాత్రం ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ లను పలకరించకుండా వాళ్ళ పక్కన ఉన్న వ్యక్తిని పలకరించి తిరిగి వచ్చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ను బాలయ్య అవమానించాడు అంటూ బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎన్టీఆర్ పై సానుభూతి చూపిస్తున్నారు నెటిజన్లు.
హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో నందమూరి తారకరత్న పెద్ద కర్మ జరిగింది. కాగా ఆ కార్యక్రమానికి నందమూరి – నారా కుటుంబ సభ్యులంతా వచ్చారు. బాలయ్య , చంద్రబాబు నాయుడు తదితర కుటుంబ సభ్యులంతా ముందు వరుసలో కూర్చుంటే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు మాత్రం వెనకాల కూర్చున్నారు. వాళ్ళ దగ్గరకు బాలయ్య బాబాయ్ వస్తుంటే లేచి నిలబడ్డారు. అయితే బాలయ్య మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా మరొక వ్యక్తిని కలిసి పలకరించడం ….. ఎన్టీఆర్ ను అవమానించడం తట్టుకోలేకపోతున్నారు.
Haranna Leni lotii spastanga kanapaduthundhi 🥺🙏
Dissopoint chesav Balayaa Babai🚶🏻#Tarakaratna pic.twitter.com/3BjbUZpD7j— Rishi Royal 🌐 (@iamNarasim) March 2, 2023