మార్చి 3 న హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోగల మంచు లక్ష్మి నివాసంలో మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తంతు పూర్తి కావడంతో రాయలసీమకు బయలుదేరారు. మంచు మనోజ్- భూమా మౌనిక లు రాయలసీమకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా……. భూమా మౌనిక పుట్టినిల్లు కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ కావడంతో అక్కడకు బయలుదేరారు ఈ కొత్త దంపతులు.
భూమా నాగిరెడ్డి- భూమా శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు ఈ భూమా మౌనిక రెడ్డి. భూమా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు భూమా కుటుంబంలో ఘోరం జరిగింది. భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు. దాంతో భూమా పిల్లలకు పెద్ద దిక్కు లేకుండాపోయింది. అలాంటి సమయంలో భూమా మౌనిక విడాకులు తీసుకుంది. మొదటి భర్తకు గుడ్ బై చెప్పిన సమయంలో మంచు మనోజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరి స్నేహం పెళ్లికి దారి తీసింది. మొదట ఈ ఇద్దరి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. కట్ చేస్తే ఇరు కుటుంబాలు సమ్మతించడంతో మార్చి 3 న ఒక్కటయ్యారు. ఇప్పుడు కర్నూల్ లో ఆళ్లగడ్డలో అడుగు పెడుతున్నారు.