
మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య తో విడిపోయినట్లేనా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. అందుకు నిదర్శనంగా నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ నుండి భర్త జొన్నలగడ్డ చైతన్య ఫోటోలను మొత్తం డిలీట్ చేయడమే ! ఇంతకుముందు జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ నుండి నిహారిక ఫోటోలను తొలగించాడు.
అయితే అప్పుడు నిహారిక తన ఇన్ స్టాలో భర్త ఫోటోలను తొలగించలేదు. కట్ చేస్తే ఇటీవల మాత్రం భర్త జొన్నలగడ్డ చైతన్య ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ నుండి తొలగించింది. దాంతో తన ఉద్దేశ్యం ఇదే అని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. తన ఫోటోలను మాత్రం ఉంచేసింది కానీ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసింది.
కరోనా కష్టకాలంలో 2020 లో నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లు కూడా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే కొంతకాలంగా విడాకుల గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే పుకార్లు ఎంతగా వస్తున్నా వాటిని ఖండించలేదు. దాంతో ఈ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిహారిక పెడుతున్న పోస్ట్ లను చూసి అక్కా ! బావెక్కడ అంటూ అడుగుతున్నారు కూడా. కానీ నిహారిక మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.






