
Varun Tej – Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరు అంటే ఆమె నిహారిక కొణిదెల అని చెప్పాలి.. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. నిహారిక ముందుగా యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయ్యింది.. ఆ తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకు అంతగా కలిసి రాలేదు..
నటన పరంగా మెప్పించిన కూడా హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి.. అందుకే నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారిపోయింది. తాజాగా ఈమె డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.. ఈ సందర్భంగా ఈమె ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తుంది.. గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతుంది.
అయితే తాజాగా యూట్యూబ్ లో ఈమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి వార్తలపై కూడా స్పందించింది.. వరుణ్ తేజ్ పెళ్లి లావణ్య త్రిపాఠీ తో జరగనుంది అని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి..
ఈ రూమర్స్ పై నిహారిక స్పందించింది.. ఈమె మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ వచ్చే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.. ఇందులో నిజమెంత ? అని ప్రశ్నించగా.. నిహారిక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించింది.. ఇప్పుడు దీని గురించి మాట్లాడు కోవడం లేదు.. కేవలం ‘డెడ్ పిక్సల్స్’ గురించే స్పందించాలని అనుకుంటున్నా అంటూ ఈమె చెప్పుకొచ్చింది.