ఈరోజు నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
డిసెంబర్ 23 న విడుదలైన 18 పేజెస్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. యువత ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్న చిత్రం కావడంతో ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కార్తికేయ 2 వంటి బ్లాల్ బస్టర్ తర్వాత నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కావడం విశేషం. నిఖిల్ – అనుపమ ల మధ్య వచ్చిన సన్నివేశాలు యువతను అలరించేలా ఉన్నాయి. దాంతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం నిలవడం ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి ఈరోజు విడుదలైన రెండు చిత్రాలు రవితేజ ధమాకా , నిఖిల్ 18 పేజెస్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.