నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 విడుదలై 30 రోజులు అవుతున్నప్పటికీ ఎక్కడా ఊపు తగ్గలేదు. దాంతో నెల రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. శ్రీకృష్ణ తత్వం గురించి అద్భుతంగా చెప్పిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ నిర్మించడం విశేషం. కార్తికేయ 2 తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లను సాధించింది.
నిఖిల్ కు సాలిడ్ హిట్ ని అందించింది కార్తికేయ 2. గతంలో చందు మొండేటి – నిఖిల్ కాంబినేషన్ లో కార్తికేయ చిత్రం వచ్చింది. 2014 లో వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఇన్నాళ్లకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేయగా ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కార్తికేయ 3 కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నారు చందు మొండేటి – నిఖిల్.