
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ” 18 పేజెస్ ”. ప్రముఖ దర్శకులు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి సూర్యకుమార్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. డిసెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా వసూళ్లు లేవు.
వారం రోజుల్లో ఈ చిత్రం 20 కోట్లు వసూల్ చేసింది. 20 కోట్ల గ్రాస్ మాత్రమే ఈ చిత్రానికి వచ్చింది. 18 పేజెస్ చిత్రానికి దాదాపు 12 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే 13 కోట్ల షేర్ రావాలి. ఇప్పటికి 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో 10 కోట్ల షేర్ కూడా రాలేదు. ఈ సినిమాను కొన్న బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో 3 కోట్ల షేర్ రాబట్టాలి.
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 ఆగస్టు లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం తెలుగులోనే రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో కార్తికేయ 2 తర్వాత 18 పేజెస్ చిత్రం విడుదల అవ్వడంతో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించారు. కానీ 18 పేజెస్ మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది.