నాకు ఫిలిం ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది నిత్యామీనన్. నాకు పొగరు ఎక్కువ , ఎవరినీ కలవను అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కానీ నాకు అలాంటివేమీ లేవు. కాకపోతే ఆత్మాభిమానం ఎక్కువ. దాంతో నన్ను అందరూ పొగరుబోతు అని అనుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
నాతో సినిమాలు చేసినవాళ్లకు నేనేంటో తెలుసు. అయినప్పటికీ ఇలాంటి కామెంట్స్ వినబడుతున్నాయంటే అందుకు కారణం ముమ్మాటికీ నా శత్రువుల పనే ! నాపై లేనిపోనివి రాజేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని , నేను ఎదగడం కొంతమందికి ఇష్టం లేదని అలాంటి వాళ్లే ఇలా విష ప్రచారం చేస్తున్నారని అంటోంది.
ప్రతిభ కలిగిన నటిగా మంచి పేరు సంపాదించుకుంది నిత్యామీనన్. అయితే అదే సమయంలో పొగరు ఎక్కువే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ లో జోక్యం చేసుకోవడం , కొంతమంది కలుస్తామని అడుగుతుంటే వాళ్ళని కలవకపోవడంతో నిత్యామీనన్ పై విమర్శలు ఎక్కవయ్యాయి.
Breaking News