సీనియర్ నటి , మాజీ ఎంపీ జయప్రద పై ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? జయప్రద టాలీవుడ్ నటి అయినప్పటికీ …… రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంట్రీ ఇచ్చినప్పటికీ …… ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుతో వచ్చిన విభేదాలతో ఉత్తరప్రదేశ్ కు మకాం మార్చింది.
సమాజ్ వాదీ పార్టీలో చేరి రాంపూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలిచింది. పార్లమెంట్ సభ్యురాలిగా సేవలు అందించింది. అయితే సమాజ్ వాదీ పార్టీలో అజాం ఖాన్ అనే నేతతో జయప్రదతో పెద్ద ఎత్తున విబేధాలు తలెత్తాయి. ఆ రాజకీయాలను పక్కన పెడితే ……….. 2019 లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించింది జయప్రద.
రెండు సందర్భాల్లో కూడా ఎన్నికల నిబంధనలను అతిక్రమించడంతో జయప్రదపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసులలో రాంపూర్ కోర్టు ఎన్నిసార్లు జయప్రదను హాజరు కావాలని కోరినప్పటికీ జయప్రద స్పందించలేదు. దాంతో ఆగ్రహించిన రాంపూర్ కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.జనవరి 9 కు కేసు విచారణ వాయిదా వేసింది.