
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈ నెలలో ప్రారంభం అవుతుంది అనుకుంటే సరిగ్గా అదే సమయంలో నందమూరి తారకరత్న మరణించడంతో ప్రారంభోత్సవం వాయిదాపడింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవ డేట్ వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ప్రారంభోత్సవం అయ్యేది ఎప్పుడో తెలుసా …… మార్చి 15 న. అవును మార్చి 12 న ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిపోతుంది. దాంతో మార్చి 14 న ఎన్టీఆర్ ఇండియా తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజునే అంటే మార్చి 15 న ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ప్రారంభం అవుతుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగింది కాబట్టి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ , యువ సుధా ఆర్ట్స్ తో కలిసి నిర్మించనున్నాడు.






