
ఆర్ఆర్ఆర్ వంటి వాల్డ్ వైడ్ సినిమా తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తున్న మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. హిట్ కొట్టాలనే కసితో కొరటాల, గ్లోబల్ యంగేజ్ కంటిన్యూ చేయాలనే పట్టుదలతో ఎన్టీఆర్ ఈ మూవీ చేస్తుంటంతో ఈప్రాజెక్టుపై ఆందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. అటు కొరటాల కూడా అదే హింట్ ఇచ్చాడు ఇటీవల సినిమా ప్రారంభోత్సవంలో. ఇందులో యంగ్ టైగర్ మృగాల వేటను చూస్తారని.. చెప్పుకొచ్చాడు. తాజాగా బయటకు వచ్చిన విషయాలను వింటోంటే.. ఆయన చెప్పిన మాటలు నిజమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ తో ఈ మూవీలో కొరటాల భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బాట్స్ ను రంగంలోకి దింపినట్టుగా చెబుతున్నారు. అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా.. ఫస్ట్ షెడ్యూల్‌లోనే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.. సముద్రంలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌తో పాటు కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సముద్రంలో కార్గో షిప్ పై జరిగే యాక్షన్.. సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్‌కి కూడా హాలీవుడ్ మాస్టరే కంపోజ్ చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తారక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయట. పోరాట సన్నివేశాలలో.. రక్తం ఏరులై పారబోతున్నట్టు తెలుస్తోంది. కొరటాల సైలెంట్‌గా ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా హాలీవుడ్ టెక్నీషియన్లని దించుతున్నారు. మొన్న స్టంట్ మాస్టర్, ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్‌ని తీసుకొచ్చారు. వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ బ్రాడ్ మిన్నిచ్ ని రంగంలోకి దించారు. తాజాగా దర్శకుడు కొరటాల.. ఆయనతో సెట్‌లో డిస్కస్ చేస్తున్న ఫోటోని పంచుకునగా వైరల్ గా మారింది. ఈ విషయం పక్కనబెడితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టేవారెవరు అన్నది ఓ పట్టాలన తేలడం లేదు. ఆ మధ్యలో బాలీవుడ్ నుంచి విలన్‌ను ఇంపోర్ట్ చేస్తున్నట్టు వినిపించింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా విలన్‌ను అనౌన్స్ చేయలేదు కొరటాల. దీంతో ఎన్టీఆర్ 30లో విలన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఎన్టీఆర్ 30 చిత్రానికి హాలీవుడ్ టచ్ గట్టిగానే ఇస్తున్నారని తెలుస్తోంది.