విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ అనే కథని సిద్ధం చేసాడట. ఆ కథలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాక్సాఫీస్ బద్దలు అవుతుందని భావించారట. అందుకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యాడని తెలుస్తోంది. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి అడిగితే తప్పకుండా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని భావించిన మీదటే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతంలో నైజాం నవాబు , రజాకార్లు సాగించిన దమనకాండ అంతాఇంతా కాదు. దాంతో అప్పటి చరిత్రను తప్పకుండా దృశ్యరూపం ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తోంది కాషాయ దండు. ఇక ఈ కథకు ఎన్టీఆర్ హీరో అయితే మరింతగా పెద్ద హిట్ అవ్వడం ఖాయం. అలాగే తెలంగాణ ప్రజల దృష్టిలో బీజేపీ మరింత ఎదగడం ఖాయమని భావిస్తున్నారట.
తెలంగాణతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సినిమాకు ఆదరణ లభిస్తుంది కాబట్టి ఎన్టీఆర్ చేత నటింపజేయాలని అందుకు అమిత్ షా జోక్యం చేసుకున్నాడని , ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇక ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉంది అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.
Breaking News